రాంచందర్‌రావు మెట్రో ప్రయాణం
ఇంధన పొదుపు, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సందేశం
సికింద్రాబాద్, మే 15 (విజయక్రాంతి): ప్రధాని మోదీ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు శుక్రవారం మెట్రోలో ప్రయాణించారు. తార్నాక నుంచి జూబ్లీహిల్స్ వరకు మెట్రోలో ప్రయాణించి ఇంధన పొదుపు,- ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు సందేశం ఇచ్చారు. కారుకు బదులు మెట్రోను ఎంచుకుని ప్రజల మధ్య సాధారణ ప్రయాణికుడిలా వెళ్లారు. ప్రయాణికులతో మమేకమై, ఆప్యాయంగా మాట్లా డారు.
ప్రజా రవాణా వినియోగంపై అవగాహన కల్పిస్తూ, ఇంధన ఆదా- పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని, ప్రజా రవాణా వినియోగంతో దేశ ఆర్థిక భారాన్ని తగ్గించాలని, ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రజా రవాణా వినియోగాన్ని కేంద్రం ప్రోత్సహిస్తున్నదని, విదేశీ ఆధారిత ఇంధన వినియోగం తగ్గించాలన్నదే ప్రధాని విజన్ అన్నారు. వోక ల్ ఫర్ లోకల్ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధా న్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక స్వావలంబన కోసం ప్రజల భాగస్వామ్యం అవసరమని, ప్రధాని సూచించిన 10 సూ త్రాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు.






