24-06-2025 10:41:39 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner)గా తన్నీరు రమేష్ నియమితులయ్యారు. ఇక్కడ కమిషనర్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు హెచ్ డి ఎంఎకు బదిలీ అయ్యారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో మేనేజర్ గా పనిచేస్తున్న రమేష్ ప్రమోషన్ పై బెల్లంపల్లి కమిషనర్ గా బదిలీ అయ్యారు. వీరి నియామకం, బదిలీ ఉత్తర్వులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి వెలువడ్డాయి.