14 July, 2026 | 4:50 AM

ఎస్‌బీఐ మేనేజర్‌గా రమేష్ బాధ్యతల స్వీకరణ

14-07-2026 12:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 13: జాజిరెడ్డిగూడెం మండల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)మేనేజర్ గా జి రమేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఈయన జనగామ నుంచి బది లీపై ఇక్కడికి వచ్చారు.గతంలో ఇక్కడ మేనేజర్ గా పని చేసిన రామకృష్ణ ఖమ్మం జిల్లాకు బదిలీ అ య్యారు.

ఈ సందర్భంగా నూతన మేనేజర్ రమేష్ మాట్లాడుతూ బ్యాంకు కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే తన ప్రధమ లక్ష్యమని,వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని అన్నారు.బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.