calender_icon.png 11 November, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల కడుపు కొడుతున్నరు!

11-11-2025 12:00:00 AM

-అచ్చంపేట గురుకుల పాఠశాలలో నాసిరకం టిఫిన్, భోజనం

-కంపు కొడుతున్న టాయిలెట్లు, మరుగుదొడ్లు, పరిసరాలు

-పరిశీలించడానికి వెళ్లిన రిపోర్టర్‌పై పీఈటీ దురుసు ప్రవర్తన

నిజాంసాగర్, నవంబర్ 10 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమం కోసం గురుకుల పాఠశాల లను ప్రవేశపెట్టిన అధికారుల అవినీతి, అలసత్వం విద్యార్థులకు శాపంగా మారింది. విద్యార్థులకు మెనూ ప్రకారం టిఫిన్లు, భోజనాలు అందించకుండా విద్యార్థులకు నాసిరకం టిఫిన్లు, భోజనాన్ని పెడుతూ విద్యార్థుల కడుపు కొడుతున్న సంఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.

పాఠశాలలో విద్యార్థులకు సరైన భోజన సదుపాయాలు కల్పించడం లేదని  తెలియడంతో విజయక్రాంతి విలేకరి సోమవారం ఉదయం గురుకుల పాఠశాలను సందర్శించి  ఫోటోలను సేకరించుతున్న సమయంలో పాఠశా లలో విధులు నిర్వహిస్తున్న పి ఈ టి దురుసుగా ప్రవర్తించడం గమనార్హం. ఫోటోలు తీయొద్దని దబాయించారు. మెనూ ప్రకారం సోమవారం విద్యార్థులకు కిచిడి వడ్డించాల్సి ఉండగా అన్నం నీళ్ల చారు వడ్డించడం గమనార్హం, అక్కడే ఉన్న  విద్యార్థులను అడగగా ప్రతినిత్యం ఇలాగే ఉంటుందని  ఇడ్లీ చేసిన చట్నీ మాత్రం నీళ్లలాగే ఉంటుందని, ఇడ్లీ పాత్రను చూస్తే మురుగును తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదిలేక కడుపు నింపుకోవడానికి ఎలా ఉంటే అలా తిని చదువుకుంటున్నామన్నారు.

ఇట్టి విషయమై ప్రిన్సిపాల్ ను సంప్రదించాలని చూడగా ఆయన అందుబాటులో లేరు. కనీసం విద్యార్థులకు ఆసరాగా ఉండే క్లాస్ టీచర్లు కూడా  పాఠశాలను లేకపోవడం వారు నిర్వహించే విధులకు అద్దం పడుతుంది. ప్రతినిత్యం నాసిరకం ఆహారంతో విద్యార్థులకు వడ్డిస్తున్న ఏ ఒక్క అధికారి  అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో గురుకుల పాఠశాల సిబ్బందికి ఆడింది ఆటగా తయారైంది.24 గంటలు గురుకుల పాఠశాలలో సిబ్బంది విద్యార్థులను పర్యవేక్షించాల్సి ఉన్న ఏ ఒక్క సిబ్బంది కూడా పాఠశాలలో అందుబాటులో లేకపోవడంతో వారు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

కంపు..కంపు.. 

గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించి బయటకు వస్తున్న సమయంలో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న కొంతమంది విద్యార్థులు మా యొక్క బాత్రూం చూడండి అని పిలువగా  వెళ్లి చూస్తే మరీ ఘోరంగా ఉన్నాయి. స్నానపు గదులకు డోర్లు లేకపోగా మరుగుదొడ్లలో దుర్గంధం వ్యాపించి ఉంది  దానికి తోడు సరైన పరిశుభ్రత పాటించకపోవడంతో మరుగుదొడ్లతో పాటు పరిసరాలు సైతం కంపు కొడుతున్నాయి. ప్రతినిత్యం శానిటేషన్ కాంట్రాక్టర్ ద్వారా పరిశుభ్రం చేయాల్సి ఉన్న అధికారుల అజమాయిషి లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇస్తారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నాడు.

కనీసం బ్లీచింగ్ పౌడర్ , యాసిడ్ నువేసి శుభ్రపరచాల్సి ఉన్న అవేమీ వేయకుండానే శుభ్రపరుస్తుండడంతో   రంగు మారి కంపు కొడుతున్నాయి.  పాఠశాలకు వస్తున్నామా విధులు నిర్వహిస్తున్నామా జీతం తీసుకుంటున్నామ అనే వ్యవహారంగా తయారైంది పాఠశాల సిబ్బంది పనితీరు  . విద్యార్థులు గ్రామంలోని రోడ్లపై కిరాణా షాపుల వద్ద విచ్చలవిడిగా తిరుగుతున్న ఇక్కడ పనిచేసే టి ఏ మాత్రం అటువైపు కన్నీటి చూడకపోవడం ఆయన నిర్వహిస్తున్న విధులకు నిదర్శనం.

గతంలో ఒక విద్యార్థి మంజీరా పరిసర ప్రాంతాలకు వెళ్ళగా  అది గమనించిన కొందరు పాఠశాలకు ఆ విద్యార్థిని తీసుకొచ్చి వారికి అప్పగించారు. గతంలో కొంతమంది విద్యార్థులు పాఠశాల నుండి పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇంత జరుగుతున్న కనీసం విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచడంలో నిర్లక్ష్యం  గా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులకు నాశరకమైన భోజనాన్ని వడ్డిస్తూ, రాజ్యాంగ వ్యవహరిస్తున్న పాఠశాల సిబ్బందిపై ఉన్నతాధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఈ విషయమై స్థానిక తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారికి  సమాచారం ఇవ్వగా వారు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.