మణికొండ వేదకుమార్‌కు అరుదైన గుర్తింపు
ఇంటాక్ న్యూఢిల్లీ గవర్నింగ్ కౌన్సిల్‌కు నాలుగోసారి ఎన్నిక
ముషీరాబాద్, మార్చి 19(విజయక్రాంతి): వారసత్వ సంరక్షణలో చారిత్రాత్మక మైలురాయిని నెలకొల్పిన మణికొండ వేదకుమార్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్(కళ) అండ్ కల్చరల్ హెరిటేజ్(సాంస్కృతిక వారసత్వం-ఇంటాక్), న్యూఢిల్లీ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికలలో రికార్డు స్థాయి అత్యధిక ఓట్లతో తిరిగి ఎన్నికైనట్లు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ సెక్రెటరి కట్టా ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ వేదకుమార్ అర్బన్, రీజినల్ ప్లానర్, అంకితభావంతో పనిచేస్తున్న వారసత్వ సంరక్షకుడు వరుసగా నాలుగోసారి మూడు సంవత్సరాల కాలానికి మళ్లీ ఎన్నికయ్యారని తెలిపా రు. ఈ ఎన్నికల్లో ఐఎన్ టీఏసీహెచ్ చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించడం ఆయన నిబద్ధత, విశ్వసనీయత, వారసత్వ సంరక్షణలో చేసిన విశిష్ట సేవలను ప్రతిబింబి స్తోందని తెలిపారు.
నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవంతో, ఆయన ము ఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని స్మారక చిహ్నాలు, చారిత్రక భవనాలు, సాంస్కృతిక, సహజ వారసత్వ ప్రదేశాల గుర్తింపు, సంరక్షణ, పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.




