13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గాంధీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

01-04-2026 12:00 AM

భారీ ప్లీహాతో బాధపడుతున్న మహిళకు విజయవంతంగా ఆపరేషన్ చేసిన వైద్యులు

సికింద్రాబాద్, మార్చి31 (విజయక్రాంతి): ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు గాంధీ ఆసుపత్రి వైద్యు లు అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. భారీగా  పెరిగిన ప్లీహగ్రంధి, ప్యాన్సై టోపీనియా వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళపై అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వారసిగూడ కు చెందిన బాధితు రాలు మూడు నెలలుగా కడుపు నొప్పి,నెల రోజులుగా కడు పు ఉబ్బరం సమస్యలతో ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షల్లో ప్లీహం అసాధార ణంగా పెరిగి నాభి కింద వరకు విస్తరించినట్లు వైద్యులు గుర్తించారు.

అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ప్లీహా పరిమాణం 19స23 సెంటీ మీటర్లుగా నమోదు కాగా, రక్తంలో ఎర్ర, తెల్ల కణాలు, ప్లేట్ లెట్స్ గణ నీయంగా తగ్గినట్లు తేలింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సీనియర్ సర్జన్ డాక్టర్ సునీల్, అన స్థీషియా వైద్యుడు డాక్టర్ మురళి ఆధ్వర్యంలోని బృందం అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స చేపట్టి విజయ వంతం చేశారు. శస్త్రచికిత్సలో సుమారు 45స20 సెంటీమీటర్ల పరిమాణం, 2.8 కిలోల బరువున్నభారీ ప్లీహాన్ని తొలగించారు. ఈ విజ యానికి గాంధీ ఆసుపత్రి అదనపు డీఎంఈ డాక్టర్ వాణి, ఇంచార్జి సూప రింటెండెంట్ డాక్టర్. శోభ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా మద్దతు అందించారు.