ఓయూలో పేరుకే జాతీయ సదస్సు
అతిథులందరూ స్థానికులే
సికింద్రాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): ఓయూలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాక్షిగా జరిగిన జాతీయ సదస్సు నిర్వహ ణ లోపాలతో అభాసుపాలైంది. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందంగా సాగిన ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి ప్రమాణాలు ఎక్కడా కనిపించలేదు. నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల నుండి నిపుణులు రావాల్సి ఉండ గా, కేవలం స్థానిక డిపార్ట్మెంట్లోని అధ్యాపకులనే స్పీకర్లుగా పిలిపించి తూతూ మంత్రంగా సదస్సును ముగించేశారు. ఈ అస్తవ్యస్త నిర్వహణ వల్ల రెండు రోజుల పాటు విద్యార్థుల కు, అతిథులకు కనీసం సరిపడా భోజ నం కూడా అందక వారు ఆకలితో అలమటించాల్సి వచ్చింది. రెండో రోజు భోజ నం సరిపోదనే భయంతో ఏకంగా సదస్సు హాలు గేట్లకు తాళాలు వేసి విద్యార్థులను అడ్డుకోవడం విస్మయానికి గురిచేసింది.
లోపల ఉన్న వారు సైతం ఖాళీ కడుపు తోనే వెనుదిరగడం ఓయూ ప్రతిష్టను దిగజార్చింది. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డైరెక్టర్లు, అధికారులు సదస్సు నిధులను ఏం చేస్తున్నారని, కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎందు కు విఫలమయ్యారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం కాగితాల మీద రికార్డుల కోసమే ఇటువంటి నాణ్యత లేని సదస్సులు నిర్వహిస్తూ నిధులు దుర్వినియోం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి బాధ్యతారాహిత్య ప్రదర్శనపై విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.




