29-07-2025 12:25:51 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు, జులై 28: నిరుపేదల ఆత్మగౌరవానికి నిదర్శనం రేషన్ కార్డు అని, గత ప్రభుత్వంలో అర్హులైన వారికి రేషన్ కార్డు అందక అరిగోస పడ్డారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ముడిపడి ఉం డడంతో తమ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తుందని ఆయన గుర్తు చేశారు.
సోమవారం కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో తాసిల్దార్లు ముంతాజ్, లలిత ల ఆధ్వర్యంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డు ల ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పాలనలో అర్హులకు రేషన్ కార్డులు అందక పలు సంక్షేమ పథకాలకు దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల హామీల మేరకు నిరుపేదల చిరకాల వాంఛ అయిన ఆహార భద్రత కార్డులను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. పేద ప్రజల జీవితాలకు రేషన్ కార్డు భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు. సీఎం ప్రజాపాలనలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని... ఇంకా విడుత లవారీగా ఇల్లు మంజూరు అవుతాయని ఎవరు ఆందోళనకు గురి కావద్దని ఆయన పేర్కొన్నారు.
సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన గుర్తు చేశారు. కల్వకుర్తి నియోజకవర్గం లో అన్ని గ్రామాల్లో అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే తన ముందున్న కర్తవ్యం అని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్ మండలంలో 2038, కడ్తాల మండలంలో 1400 మందికి రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి.
కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ మెంబర్ బాలాజీ సింగ్, ఏఎంసీ చైర్ పర్సన్ గీతా, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లు నరేష్, శ్రీశైలం, రాష్ట్ర పీసీసీ మెంబర్ ఆయిల్లో శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్ , నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ధనంజయ, కేశవులు, జగన్, విజయ్, శ్రీనివాస్ రెడ్డి, మానయ్య, శ్రీకాంత్, ఖలీల్, ప్రసాద్ లుపాల్గొన్నారు.