29-07-2025 12:27:10 AM
ఎల్బీనగర్, జులై 28 : సమాజ సేవకుడు, అనాథ విద్యార్థి గృహం అధ్యక్షు డు మార్గం రాజేశ్ కు ప్రతిష్టాత్మక అవా ర్డు లభించింది. హైదరాబాద్ లోని ర వీంద్ర భారతి మెయిన్ హాల్లో సోమవా రం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర సాధనలో కృ షి చేసిన, పోరాటాలు చేసిన, రచనల ద్వారా స్ఫూర్తి రగిలించిన , సామాజిక కృషి చేసిన ప్రముఖులను రాష్ట్ర ప్రభు త్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ అద్దం కి దయాకర్ అవార్డు అందజేసి, సన్మానించారు.
అవార్డు అందుకున్నవారిలో ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేష్ కు ‘సామాజిక సేవలో తెలంగాణ సన్మాన్‘ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా డైరెక్టర్ మా మిడి హరికృష్ణ మాట్లాడుతూ .. ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్, తన విద్యార్థులకు అత్యాధునిక వసతి , లైబ్రరీ, కంప్యూటర్ లాబ్, భోజన సౌకర్యాలు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అద్భుత విద్యావకాశాలు కల్పించి,
వారి బంగారు భవిష్యత్తుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షులు పురు షోత్తం నారగోని, తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం, తెలంగాణ బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మిపాల్గొన్నారు.