calender_icon.png 9 June, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో జూన్ 30 వరకు రేషన్ గడువు పొడిగింపు..

09-06-2025 05:39:54 PM

అదనపు కలెక్టర్ డి.వేణు..

పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలో రేషన్ కార్డుదారులు తమ రేషన్ తీసుకునేందుకు గడువు జూన్ 30 వరకు పొడిగించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు(District Additional Collector D. Venu) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రజా పంపిణీ బియ్యం జూన్ మాసంలో మూడు నెలలు ఒకేసారి పంపిణీ చేస్తున్నందున గడువు జూన్ 30 వరకు పొడిగించడం జరిగిందని లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందకుండా ఇట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.