1 July, 2026 | 6:45 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •  

రేషన్ బియ్యం పట్టివేత

18-03-2026 12:00 AM

అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలోని గోదాముల్లో నిల్వ చేసిన 420 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం 

ఎల్బీనగర్, మార్చి 17 : సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో ఒక గోదాముపై సోమవారం తెల్లవారుజామున దాడి చేసి, 420 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గోదాం నిర్వాహకుడు రమావత్ శ్రీకాంత్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ప్రభుత్వం సన్నబియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది.

ఇందులో భాగంగా  సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో అబ్దుల్లాపూర్ మెట్టు మండల పరిధిలోని ఒక గోదాముపై దాడి సుమారు 420 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ డీఎస్సీ రమేశ్ రెడ్డి, అధికారులు జంగయ్య తదితరులు పాల్గొన్నారు.