12 August, 2026 | 1:08 AM

హస్నాపూర్‌కు రేషన్ దుకాణం

12-08-2026 12:10 AM

బేల, ఆగస్టు 11 : ఏళ్లు గడుస్తున్న పరిష్కారం కానీ బేల మండలంలోని సదల్ పూర్ గ్రామపంచాయతీలో గల హస్నాపూర్ గ్రామ ప్రజల రేషన్ సమస్యలు ఎట్టకేలకు తీరాయి. ప్రతినెల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోవర్ గ్రామానికి వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సి వచ్చేది, స్థానికంగా దేశందుకనం ఏర్పాటు చేయడంతో ఆ సమస్య తీరినట్లు అయింది. హస్నాపూర్ గ్రామంలోనే రేషన్ సబ్ సెంటర్ ఏర్పాటుచేసి మంగళవారం రేషన్ షాపును ప్రారంభించి సన్న బియ్యం ప్రజలకు పంపిణీ చేశారు.

దీంతో గ్రామంలో నివసిస్తున్న 120 లబ్ధిదారుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తూ స్థానికంగా రేషన్ దుకాణం ఏర్పాటుకు కృషిచేసిన యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డినీ గ్రామ సర్పంచ్ మార్సుకోల మంగేష్ తో పాటు గ్రామస్తులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బేల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రూప్ రావు, జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, మాజీ జడ్పీటీసీ రాందాస్, బేల మండల సర్పంచుల సంఘం అశోక్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాన్ శ్యామ్, ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు కన్య రాజు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అవినాష్, ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు ఆడే శంకర్, మాజీ ఎంపీటీసీ అరుణ్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.