23 June, 2026 | 7:58 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రావెళ్ల సీతారామయ్య

26-02-2026 12:46 AM

కోదాడ, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా  పట్టణానికి చెందిన రావెళ్ల సీతారామయ్య ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాదులోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక సందర్భంగా సీతారామయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కోదాడ యూనిట్ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రావెళ్ల సీతారామయ్య విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారు.  సేవలను గుర్తించి రాష్ట్ర కార్యవర్గం అసోసియేట్ అధ్యక్షులుగా నియమిం చినందుకు గాను జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి పందిరి రఘువర ప్రసాద్, వీరబాబు, భ్రమరాంబ, జానయ్య, హాజీ నాయక్, యస్ దాని, భిక్షం, నరసయ్య, శోభారాణి, కార్యవర్గ సభ్యులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.