26 June, 2026 | 1:03 PM

వడ్డీ రేట్లు యథాతథం.. రెపోరేటు అక్కడే ఫిక్స్

07-06-2024 11:32 AM

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ శుక్రవారం వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించింది. రెపోరేటును 6.5 శాతం స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. పరపతి విధాన కమిటీ బేటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇంధన ధరల్లో ప్రతిద్రవ్యోల్బణం నమోదు అవుతోందని, ధరల పెరుగుదలపై ఎంపీసీ అప్రమత్తంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఆహార ద్రవ్యోల్బణమే కొంత మేరకు ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపు తీసుకురావడానికి ఆర్బీఐ కట్టుబడి ఉందని తెలిపారు. నైరుతి రుతుపవనాలతో ఖరీఫ్ సాగు ఉత్పత్తి పెరుగుతోందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. రిజర్వాయర్లలో నీటిమట్లాలు పెరుగుతాయని అంచనా వేశారు. 2024-25 వృద్ధి రేటు 7.5 శాతం అంచనా వేసింది. ఇది కార్యరూపం దాల్చితే వరుసగా నాలుగో ఏడాది 7 శాతం ఎగువన వృద్ధి నమోదైనట్లు అవుతుందన్నారు.