27 June, 2026 | 3:35 AM

ధ్వజస్తంభం.. గంగమ్మ అమ్మ వారి పునఃప్రతిష్ఠాపన

27-06-2026 01:58 AM

వేద మంత్రోచ్ఛారణలతో మారుమ్రోగుతున్న బొప్పారం.

చింతకాని. జూన్ 26 (విజయక్రాంతి): శ్రీ కోదండరామ స్వామి దేవాలయం లో నూతన జీవద్వజ(ధ్వజస్తంభ), గంగమ్మ అమ్మ వారి పునఃప్రతిష్టాపన  మహోత్సవములు త్రయాహ్నిక దీక్షగా 25,26,27, తేదీలలో శ్రీ మాన్ బొర్రా వాసుదేవాచార్యులు (ముత్తారం) వారియాజ్ణీకఆధ్వర్యంలోనిర్వహించబడుచున్న యాగశాల లో పలు కుటుంబాలవారు యాగం పూర్తయ్యాక పూర్ణకుంభంతో మేళతాళాలతో వేదపండితులుశ్రీ కోదండరామ స్వామి దేవాలయం వరకు మంత్రోచ్ఛారణల తో గ్రామంనలుదిక్కులమారుమ్రోగేలా దేవాలయం కు చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ షేక్ రహమతుల్లా ,ఉపసర్పంచ్ సుదా,ఆత్మకమిటి డైరెక్టర్ సట్టు వెంకటేశ్వర్లు, దేవాలయ కమిటీ సభ్యులు రేకం వెంకటేశ్వర్లు,చిలికేసి పెద్ద లింగయ్య,చిలికే సి వెంకటేశ్వర్లు, షేక్ షిలార్ సాహెబ్,జోనబోయిన వీరబాబు,మెండె చినవీరయ్య, చిలికేసి కృష్ణంరాజు,గురిజాల సంజీవరావు. గ్రామ పెద్దలు, ప్రజలు మహిళలు   తదితరులు పాల్గొన్నారు.