5 June, 2026 | 1:52 PM

బాల్యమిత్రుని కుటుంబానికి భరోసా

05-06-2026 12:49 PM

సుల్తానాబాద్, జూన్ 05 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం లోని గాంధీనగర్ నివాసి అయిన మధ్యతరగతి కుటుంబానికి చెంధిన బల్ల అనిల్ గత కొన్ని రోజుల క్రితం మరణించడం జరిగింది..ఇది తెలుసుకున్న జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్  సుల్తానాబాద్ 2007 బ్యాచ్ పాఠశాలలో చదువుకున్నా  స్నేహితులు శుక్రవారం 12, 000 రూపాయలను వారి కుటుంబానికి  ఇచ్చి , కుటుంబ పరిస్థితుల ను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు దృష్టి కి తిసుకెల్లి ఇందిరమ్మ ఇల్లు వచ్చేందుకు మద్దతు గా ఊంటమని బరోస గా నిలిచారు..భవిష్యత్తు  లో కూడా ఎలాంటి అవసరాలు ఉన్నా తమవంతు సహాయం ఎప్పుడు ఉంటుందిఅన్నారు.. ఈ కార్యక్రమములో జెడ్ పి హెచ్ ఎస్  బాలురు 2007 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన స్నేహితులు పాల్గొన్నారు.