calender_icon.png 9 August, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్‌క్రాస్ సేవలను విస్తరించాలి

21-09-2024 12:10:29 AM

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ   

ముషీరాబాద్, సెస్టెంబర్ 20: రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించి ప్రజలందరికీ చేరువ కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెడ్‌క్రాస్ సొసైటీకి సూచించారు. శుక్రవారం విద్యానగర్‌లోని రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌ను ఆయన సందర్శించారు. బ్లడ్ బ్యాంకులో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. తలసేమియా వ్యాధితో బాధప డుతూ బ్లడ్ బ్యాంకులో రక్త మార్పిడి చేయించుకుంటున్న చిన్నారులను పరామర్శిం చారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. బ్లడ్‌బ్యాంక్ ప్రజలకు అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బ్లడ్‌బ్యాంక్ చైర్మన్, ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ పీ విజయచందర్ రెడ్డి, ఓఎస్ రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్ గౌడ్, భీమ్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, సింగం శ్రీనివాస్, అమర్, మోహన్ పాల్గొన్నారు.