మెస్సీ ఈవెంట్ టికెట్ డబ్బులు వాపస్
- బెంగాల్ సీఎం సువేందు అధికారి ప్రకటన
- 33 వేల మందికి చెల్లిస్తామని వెల్లడి
కోల్‌కతా, ఆగస్టు 30 : గతేడాది కోల్కతాలోని యువభారతి స్టేడియం(Yuva Bharati Stadium)లో జరిగిన లియోనెల్ మెస్సీ(Lionel Messi) ఈవెంట్ గందరగోళం నే పథ్యంలో, నష్టపోయిన సుమారు 33,000 మంది అభిమానులకు టికెట్(ticket) డబ్బులను పూర్తిగా వాపస్ చేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి(Suvendu Adhikari) అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 2025 లో జరిగిన ఈ ఈవెంట్‌లో, రాజకీయ నాయకులు, వీఐపీల హడావుడి విపరీతమైన రద్దీ కారణంగా కనీస భద్రతా చర్యలు కరువయ్యాయి.
దీంతో మెస్సీ కేవలం 20 నిమిషాలకే అక్కడి నుండి వెళ్ళిపోవలసి వచ్చింది. అభిమానులు మెస్సీని చూడటం కోసం రూ. 3,000 నుండి రూ. 6,000 వ రకు, కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ వెచ్చిం చి టికెట్లు కొనుగోలు చేశారు. భారీగా డ బ్బులు పెట్టినా సాకర్ మాంత్రికుడు మె స్సీ ని కళ్లారా చూడలేకపోయిన ఆగ్రహంతో అభిమానులు నాడు స్టేడియంలో కుర్చీలు విరగ్గొట్టి రచ్చ చేశారు. దీంతో తమ డబ్బును తిరిగి చెల్లించాలని వారు అప్పటి నుంచి డి మాండ్ చేస్తూనే ఉన్నారు.
ఎట్టకేలకు వారి డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించింది. 33 వేల మంది అభిమానులకు న్యాయం చేసేందుకు, రాష్ట్ర క్రీడా బడ్జెట్ నుంచి నిధులను కే టాయించి డబ్బులు వెనక్కి ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అంతర్గత ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే ప్రారం భించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది ఫుట్‌బాల్ అభిమానులకు పెద్ద ఊరటనిచ్చింది.






