26 March, 2026 | 3:56 PM

Breaking News

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. 24 మంది జలసమాధి.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు!   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌   •   మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు మృతి   •   మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ   •   గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక   •   గ్యాస్ కోసం రోడ్డెక్కిన క్యూ లైన్   •   ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?   •   తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు   •   పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •  

పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం

26-03-2026 02:02 PM

మన సంక్షేమం కోసంరూ. 1000చెల్లించి సభ్యత్వం పొందాలి

అధ్యక్ష, కార్యదర్శులు వాకిట అశోక్ కుమార్, మల్లు మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వాకిట అశోక్ కుమార్ మల్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు. గురువారం మహబూబ్నగర్ లో సంఘం సభ్యులు మొదటగా సభ్యత్వం తీసుకొని సభ్యత్వాల నమోదు ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టు తప్పనిసరి సభ్యులుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

సంఘం సభ్యత్వం పొందిన సభ్యులు ప్రతి ఒక్కరికీ సంఘం నుంచి సేవలు అందుతాయని పేర్కొన్నారు. సభ్యత్వ రుసుము రూ. 1000చెల్లించి సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఎల్లుండి నుంచి అనగా శనివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, వారం రోజులపాటు ప్రతిరోజు ఇదే సమయానికి మెట్టుగడ్డ వద్ద ఉన్న మహబూబ్ నగర్ సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్ భవన్ లో సంఘం సభ్యులు  అందుబాటులో ఉంటారని తెలిపారు.

దీంతోపాటు పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యులు మహబూబ్ నగర్ అందుబాటులో ఉంటారని ప్రతి ఒక్కరూ సభ్యత్వాలు తీసుకోవాలని కోరారు. సంఘము కోశాధికారి జిల్లెల రఘు, సభ్యులు భాస్కరాచారి, కే రమాకాంత్ రెడ్డి, సంతోష్ కుమార్, సతీష్ కుమార్ రెడ్డి, కేశవులు సభ్యత్వం తీసుకున్నారు. ఆధార్ కార్డు, అక్రెడిటేషన్ కార్డు జిరాక్సులతో పాటు రెండు పాస్ ఫోటో సైజ్ ఫోటోలు అందజేసి సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. అక్రెడిటేషన్ కార్డు లేని వారు తాము పనిచేస్తున్న సంస్థ గుర్తింపు కార్డు అందజేయాలని కోరారు.