ఏజెన్సీ రక్షణకు రిలే నిరాహార దీక్షలు
ఉట్నూర్, మార్చి 29 (విజయక్రాంతి): జిల్లాలోని ఏజెన్సీ రక్షణకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 20 తేది వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టనునట్లు ఆదివాసి సంఘాల నేతలు వెల్లడించారు. ఆదివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆదివాసి సంఘాలు, గోండ్వాన పంచాయితీ రాయి సెంటర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 20న అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
అదేవిదంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి 20 తేది వరకు ఏజెన్సీ రక్షణ కోసం రిలే నిరాహార దీక్షలు చేయాలనీ ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో తీర్మానించారు. అమరవీరుల ఆశయ సాధన కమిటీ కమిటీని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ చైర్మన్ గా మేస్రం నాగ్ నాథ్ గౌరవ అధ్యక్షులుగా తొడసం నాగరావ్, ప్రధాన కార్యదర్శిగా కనక తుల్సిరాం, ఉపాధ్యక్షులు సోయం రాందాస్, జైరామ్ కార్య దర్శిగా గేడం భారత్, తొడసం హన్మంతు, సంయుక్త కార్యదర్శిగా కనక హనుమంతరావు, సలహాదారులుగా తొడసం అమృత్ రావు, మెస్రం వెంకట్రావు, మెస్రం దుర్గు, కొట్నాక్ దేవ్ సావ్, పేందర్ దాదిరావ్‌లను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గోడం గణేష్, పుర్క బాపూరావ్, జిల్లా సార్మేడి తొడసం అమృత్ రావ్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు పెందుర్ దాదా రావ్, సార్మీడిలు మెస్రం వెంకట్ రావ్, మెస్రం దుర్గు, కొట్నాక్ దేవ్ సావ్, గొండ్వాన వెల్ఫేర్ సొసైటి అధ్యక్షులు ఆడ హన్మంత్ రావ్, తుడుం దెబ్బ ఇంద్రవెల్లి అధ్యక్షులు పుర్క చిత్రు, ఖమ్ము, జూగ్నక్ భరత్, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.




