08-11-2025 12:38:01 AM
‘విజయక్రాంతి’ కథనాల ఫలితం
నంగునూరు, నవంబర్ 7:గట్లమల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ఎట్టకేలకు ఊపందుకున్నాయి.విజయక్రాంతి దినపత్రికలో లో వరుసగా ప్రచురించిన కథనాల ప్రభావంతో గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.ప్రహరీహరీ గోడ,సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్ తిప్పని రమేష్ వేగవంతం చేపట్టారు.
నీటి వసతికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి అవసరమైన బోర్ మరమ్మత్తులు పూర్తి చేశారు.త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి,పూర్తిస్థాయి పీహెచ్సీ భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం ఆయన తెలిపారు.ప్రజా సమస్యలను,ఆరోగ్య కేంద్రం దుస్థితిని వెలుగులోకి తీసుకురావడంలో ’విజయక్రాంతి’ పత్రిక చూపిన చొరవ వల్లే ఈ పనులు వేగవంతమయ్యాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.