calender_icon.png 8 November, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలి

08-11-2025 12:40:30 AM

బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్

మునిపల్లి, నవంబర్ 7 :సీసీఐ తీసుకవచ్చిన కొత్త నిబంధనలు ఎత్తి వేసి పాత నిబంధనల ప్రకారం పత్తి పంటను సీసీఐలో కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పోల్కంపల్లి - ఖమ్మంపల్లి గ్రామాల శివారులో గల పీఎస్‌ఆర్ గార్డెన్ లో బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్, మాజీ ఎంపీపీ చం ద్రయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పత్తితోపాటు వివిధ పంటలు పచ్చనిపైరులా ఉన్న సమయంలో యూరియా వల్ల రైతులు పడరాని పాట్లు పడ్డారన్నారు.

అలాగే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలన్నీ నీట మునగడంతో పా టు పత్తి కాయలు నల్లబారి పంట చేతికిందే సమయంలో మళ్లీ వర్షాలు కురవడంతో రైతులకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంటను నిబంధనలు లేకుండా రైతుల ద్వారానే కొనుగోలు చేయాలని, కపాస్ యాప్ లో భాగంగా స్లాట్ బుక్ చేసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నందున, పాత పద్దతి ద్వారానే పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ వెంకటేశం, బీఆర్ ఎస్ మండల యూత్ అధ్యక్షుడు ఆనంద్, నాయకులు సుభాష్, మొగులయ్య, విఠల్, శేఖర్, మాణయ్య, సంగమేశ్వర్, ఆనంద్ పాల్గొన్నారు.