26 August, 2026 | 7:40 AM

పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు.. వాహనదారులకు భారీ ఊరట

02-07-2026 12:34 AM
  1. ఇంధన ధరలు తగ్గించిన ‘నయారా’
  2. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున తగ్గింపు
  3. కంపెనీ సవరించిన రేట్లు అమల్లోకి 
  4. దేశవ్యాప్తంగా 7వేలకు పైగా బంకుల్లో అమలు

న్యూఢిల్లీ, జూలై 1: కొంతకాలంగా పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ఉద్రిక్తతలతో అల్లాడిపోతున్న ఇంధన వినియోగదారులకు ఊరట లభించింది. ఇరాన్ వివాదం సడలడం, కీలకమైన సముద్ర రవాణా మార్గాలు తెరుచుకోవడంతో అంతర్జాతీయంగా ముడిచమురు, ద్రవీకత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) సరఫరాలు మళ్లీ గాడిలో పడ్డాయి. దీంతో ప్రపంచవ్యాపంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. తగ్గిన ముడిచమురు ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూ భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ సంచలన నిర్ణయం తీసుకుంది.

Petrol Price Today: వాహనదారులకు భారీ ఊరట లభించింది. దేశవ్యాప్తంగా నయారా ఎనర్జీ (Nayara Energy) పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను రూ.3 చొప్పున తగ్గించింది. తాజా ధరలు వెంటనే అమల్లోకి రావడంతో రోజువారీ ప్రయాణికులు, వ్యాపారులు, ట్రాన్స్‌పోర్ట్ రంగానికి ఉపశమనం లభించింది.

దేశవ్యాప్తంగా ఉన్న తమ రిటైల్ నెట్‌వర్క్‌లో బుధవారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను లీటరుకు రూ.3 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత ఇంధన ధరలను తగ్గించిన మొదటి రిటైలర్‌గా నయారా నిలిచింది. దేశవ్యాప్తంగా నయారాకు చెందిన 7,000 ఇంధన స్టేషన్లలో  సవరించిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఇది నిజంగా పెద్ద రిలీఫ్.

Nayara Energy దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను రూ.3 చొప్పున తగ్గించింది. ఈ కొత్త ధరలు 7,000కు పైగా ఇంధన బంకుల్లో తక్షణమే అమల్లోకి వచ్చాయి.

కొత్త రేట్ల ప్రకారం..

కొత్త రేట్ల ప్రకారం.. నయారా బంకుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.5, అలాగే లీటర్ డీజిల్‌పై రూ.3 చొప్పున తగ్గించారు. ఈ తగ్గింపు తర్వాత బెంగళూరులో లీటరు పెట్రోల్ రూ.111.20, డీజిల్  రూ.98.80కి చేరింది. అటు మహారాష్ట్రలో లీటర్ పెట్రోల్ రూ.111.66, డీజిల్ రూ.97.99 కాగా.. ఫరీదాబాద్‌లో పెట్రోల్ రూ.103, డీజిల్ రూ.98.84 కి తగ్గాయి. స్థానిక రవాణా ఖర్చులు, వ్యాట్ ఆధారంగా జిల్లాల వారీగా ఈ ధరల్లో కొన్ని పైసల వ్యత్యాసం ఉండనుంది.

FAQ's

Q1. పెట్రోల్ ధర ఎంత తగ్గింది?

నయారా బంకుల్లో లీటరుకు రూ.5 తగ్గించారు.

Q2. డీజిల్ ధర ఎంత తగ్గింది?

డీజిల్‌పై లీటరుకు రూ.3 తగ్గింపు అమలులోకి వచ్చింది.

Q3. ఈ తగ్గింపు దేశవ్యాప్తంగా అమలులో ఉందా?

అవును. దేశవ్యాప్తంగా నయారా ఎనర్జీకి చెందిన 7,000కు పైగా బంకుల్లో అమల్లో ఉంది.

Q4. పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గాయి?

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గడం, Crude Oil Prices పడిపోవడం ప్రధాన కారణాలు.

Q5. ఇతర ఆయిల్ కంపెనీలు కూడా ధరలు తగ్గించాయా?

ప్రస్తుతం నయారా ఎనర్జీ మాత్రమే అధికారికంగా ధరలు తగ్గించినట్లు ప్రకటించింది.

Read today's latest petrol price updates, diesel rates, LPG news, business news and Telugu breaking news on Vijayakranthi.

Related Articles:

  • వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
  • దిగొస్తున్న పసిడి ధరలు
  • జీఎస్టీ వసూళ్ల జోరు
  • ద్రవ్యోల్బణంపై కేంద్రం కీలక నిర్ణయం 
  • ఇంధన ధరల పెరుగుదలపై గత వార్తలు