3 July, 2026 | 11:43 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట

20-08-2024 03:01 AM
  1. ముడా స్కామ్ కేసులో తక్షణ చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టుకు ఆదేశం 
  2. ఆగస్టు 29న తదుపరి విచారణ

బెంగుళూరు, ఆగస్టు 19: ముడా స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. ముడా స్కామ్‌కు సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేయగా.. ఆయనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును.. హైకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 29న చేపడతామని స్పష్టం చేసింది. 

నా జీవితం తెరిచిన పుస్తకం..

తనపై వస్తున్న ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేశారు. ‘నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఇప్పటివరకు ఎలాంటి తప్పు చేయలేదు. భవిష్యత్‌లోనూ చేయను. విపక్ష బీజేపీ, జేడీఎస్‌లు నాపై కావలనే కుట్రపన్ని కోర్టులో కేసులు వేశా యి. ఆగస్టు 17, 1984లో తొలిసారి మంత్రి పదవి చేపట్టాను. అప్పటి నుంచి ఇప్పటివరకు నా రాజకీయ జీవితంలో ఒక్క మరక కూడా లేదు. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ మాదిరిగా కర్ణాటకలోనూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎన్డీఏ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. నాపై వచ్చిన ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తాను’ అని స్పష్టం చేశారు. ముడా స్కాంలో ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్‌ను సిద్ధూ తోసిపుచ్చారు.