calender_icon.png 6 September, 2025 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ సంస్కరణలతో సామాన్యుడికి ఊరట

06-09-2025 12:52:18 AM

-బీజేపీ నాగోల్ డివిజన్ అధ్యక్షుడు పంగ శ్రీకాంత్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): జీఎస్టీ సంస్కరణలతో సామాన్యుడికి ఊరట లభించిందని బీజేపీ నాగోల్ డివిజన్ అధ్యక్షుడు పంగ శ్రీకాంత్ పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపు నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రజలపై ఆర్థిక భా రం తగ్గించినందుకు కృతజ్ఞతగా నాగోల్ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్రమోదీకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ పాల్గొని మాట్లాడారు.

జీఎస్టీ తగ్గింపుతో పేద ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రం గారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బద్దం బాలకృష్ణ, సంజీవరెడ్డి, నూకల పద్మారెడ్డి, సరస్వతి, శేఖర్, పంగ శ్యామ్ కుమార్, రావుల శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, చంద్రశేఖర్ గుప్త, లయ శెట్టి, కొండబత్తుల శ్రీనివాస్, ప్రేమ్, నాగోల్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు వినోద్ యాదవ్, నరేశ్ యాదవ్, శివశంకర్, విజయశంకర్, గోపాల్ శర్మ, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.