06-09-2025 12:53:06 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాం తి): రాష్ట్రానికి వచ్చే 20 రోజుల్లో రోజుకు 10 వేల టన్నుల చొప్పున 2 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామని, సానుకూలంగా స్పందించిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ మూత పడటంతో దేశీయ తయారీ యూ నిట్ల నుంచి కూడా అదనంగా 30 వేల టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించడానికి కేంద్రం అంగీకరించినట్టు తెలిపా రు.
దీంతో రాష్ర్టంలో ఎరువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉం టుందన్నారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ర్టవ్యాప్తంగా యూరియా సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాలవారీగా, పాస్ పుస్తకాల ఆధారంగా ఒక రోజు ముందుగానే టోకెన్లు జారీ చేసి రైతులకు ఎరువులు అందించేలా ఏర్పాట్లు చే యాలని సూచించారు.
కోఆపరేటివ్, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పోలీస్, విజిలెన్స్ విభాగాలతో కూడిన పర్యవేక్షణతో ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మూతపడిన రామగుండం ఎరువులు ఉత్పత్తిని నాలుగు రోజుల్లో ప్రారంభించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని వివరించారు.
శుక్రవారం 11,181 టన్నుల యూరియా రాష్ట్రానికి చేరిందని, శనివారం మరో 9,039 టన్నులు వస్తుందని, సెప్టెంబర్ నెలలో కేవ లం నాలుగు రోజుల్లోనే రాష్ట్రానికి 28 వేల టన్నులు సరఫరా అయిందని చెప్పారు. ఇ ప్పటివరకు రాష్ర్టంలో 8,20,112 టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, గత సంవత్సరం ఇదే సమయానికి 7,75,157 ట న్నుల అమ్మకాలు మాత్రమే జరిగాయని వి వరించారు. రైతులు అవసరం మేరకే యూరి యా కొనుగోలు చేయాలని, ఒకేసారి అధిక మొత్తంలో నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తిచేశారు.