06-09-2025 12:51:50 AM
ఏనుగు సుదర్శన్‌రెడ్డి
మేడిపల్లి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ బీజేపీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన్‌రెడ్డి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రకోటపై చెప్పిన మాటను నిలబెట్టుకున్న మన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.కొత్త జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజలందరికీ మరింత ఆర్థిక లాభాలు చేకూరుతాయని, ఇది రైతు నుండి విద్యార్థి వరకు,వ్యాపారి నుండి వినియోగదారు.
వరకు, అందరికీ ఊరట ఇచ్చే సం స్కరణలు, కేవలం పన్ను సంస్కరణ కాదు. ఈ కార్యక్రమంలో జిల్లా యువమోర్చా అధ్యక్షులు పవన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి స్వరూప్, జిల్లా అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి, సుజాత, సీనియర్ నాయకులు కరుణాకర్ రెడ్డి, సుధాకర్ చారి, శశి, ప్రధాన కార్యదర్శి బాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.