calender_icon.png 7 October, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యతరగతికి ఉపశమనం

07-10-2025 12:00:00 AM

‘ప్రజలపై పన్నుల భారం తగ్గించే లా జీఎస్టీ సంస్కరణలు తీసుకువస్తాం. ఇది మీకు ఒక దీపావళి కానుక అవుతుంది.’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆగష్టు 15, 2025న ఎర్రకోట సాక్షిగా మోదీ ఇచ్చిన మాటే నేటి పన్నుల పండుగ. 2017లో దేశానికి అ త్యంత పెద్ద పన్ను సంస్కరణగా ప్రవేశపెట్టబడిన గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీ ఎస్టీ) ఇప్పుడు తదుపరి తరం సంస్కరణలతో మరింత సులభతరం, న్యాయమైన దిగా, అభివృద్ధి దిశగా రూపాంతరం చెం దుతోంది అని యావత్ భారత దేశానికి మోదీ ఇచ్చిన సందేశం.

జీఎస్టీకి ముందు భారతదేశంలో పరోక్ష పన్నుల వ్యవస్థ విభజనాత్మకంగా ఉండేది. రాష్ట్రాల వారీగా వేర్వేరు పన్నులు, వేర్వేరు రేట్లు ఉండేవి. ఒకే వస్తువుపై ద్వంద్వ పన్నులు (వాట్ ప్లస్ సర్వీస్ టాక్స్) విధించేవారు. 2017 జూలై 1న ప్రధాని మోదీ జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత 17 పన్నులు, 13 సెస్సులు ఒకే పన్ను వ్యవస్థలో కలిసిపోయాయి. దీని వల్ల ‘ఒకే దేశం పన్ను మార్కెట్’ అనే కల సాకారమైంది. ఒక విధంగా భారత్‌కు ఆగష్టు 15న స్వతంత్రం వస్తే.. 2017, జూలై 1న ప్రజలు పన్నుల ప్రళయం నుంచి విముక్తి పొందారు. ఈ కొత్త జీఎస్టీ సంస్కరణలు దేశంలోని మధ్యతరగతి ప్రజలకు అధిక ఉపశమనం కలిగించిందనడంలో అతిశయోక్తి లేదు.

స్లాబులపై అయోమయం

జీఎస్టీ విజయవంతమైనప్పటికీ, ఐదు వేర్వేరు స్లాబ్ రేట్లు (0, 5, 12, 18, 28 శాతం) ప్రజలకు, వ్యాపారులకు అయోమయాన్ని కలిగించాయి. ముఖ్యంగా 28 శాతం అధిక పన్ను రేటు సిమెంట్, వాహనాలు, గృహోపకరణాలపై భారంగా మా రింది.  ముఖ్యంగా జీఎస్టీ తీసుకొచ్చినప్పు డు అటు కేంద్ర, ఇటు రాష్ట్రాలు తమ ఆదాయం కోల్పోతామేమోనని భయపడ్డాయి. కానీ 2022 వరకు కేంద్రం రాష్ట్రా లు కోల్పోయే ఆదాయాన్ని 100 శాతం భర్తీ చేస్తామనే హామీ ఇచ్చిన తర్వాత అమలు చేయడం జరిగింది. కానీ 2020 నుంచి -2022 వరకు కోవిడ్ మహమ్మారి కారణంగా ఆదాయానికి  గండి పడింది.

అప్పుడు కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ ప్లాన్ కింద తొలి వేవ్‌లో 20 లక్షల కోట్లు, రెండో వేవ్‌లో 6 లక్షల కోట్లకు పైగా సహాయాన్ని ప్రవేశ పెట్టింది. దీంతో జీఎస్టీ 2.0 సంస్కరణలను కేంద్రం వాయిదా వేయాల్సి వ చ్చింది. తాజాగా ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో అన్ని వర్గాలు.. పేదోడి నుంచి ధనవంతుడి దా కా, బైక్ నుంచి బెంజ్ వరకు, రైతు నుంచి పారిశ్రామికవేత్తల వరకు, విద్య నుంచి వైద్యం దాకా మార్పులు జరిగాయి. కొత్త సంస్కరణల ప్రకారం ఇకపై కేవలం 5, 18 శాతం స్లాబులు మాత్రమే ఉంటాయి. అ యితే తంబాకు, పాన్ మసాలా, కార్బొనేటెడ్ డ్రింక్స్, లగ్జరీ కార్లు, యాచ్‌లు, ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌పై మాత్రం 40 శాతం పన్ను యధావిథిగా కొనసాగుతున్నది.

అన్ని రంగాలకు లబ్ధి

జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ఇంటింటికి లాభమే తప్ప నష్టం తక్కువ అని చెప్పొచ్చు. 5 శాతం స్లాబులోకి సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్‌లు, టూత్‌పేస్టు, సైకిళ్లు తదితర వస్తువులు రాగా.. రొట్టెలు, పనీర్, పాలు పన్ను రహితంగా మారాయి. చాక్లెట్లు, కాఫీ, సాస్‌లు, పాస్తా, నమకీన్, మాంస పదార్థాలు 12 లేదా 18 శాతం నుంచి 5 శాతం స్లాబుకు తగ్గగా.. టీవీలు (32 అంగుళాల పైగా), ఏసీలు, డిష్ వాష ర్లు 28 శాతం నుంచి 18 శాతానికి మారా యి.

దేశంలో అధిక జనాభా మధ్యతరగతి వారే కావడంతో ఈ సంస్కరణలు వారికి ఎంతో లబ్ధి చేకూర్చనున్నాయి. అంతేకాదు ఈ సంస్కరణలు ఆటోమొబైల్ రంగానికి పెద్ద ఊతం. బైకులు, చిన్న కార్లు, బస్సులు, ట్రక్కులు, ఆటోలు, విడిభాగాలు 28 నుం చి 18 శాతం తగ్గడం విశేషం. భారత్‌లో ఏటా 2.5 కోట్ల కొత్త వాహనాలు కొనుగోళ్లు జరుగుతుంటాయి. తాజా జీఎస్టీ సంస్కరణ వల్ల వాహన కొనుగోలుదారులు ఏడాదికి 1.07 నుంచి-1.30 లక్షల కోట్లు లబ్ధి పొందనున్నారు. వ్యవసాయం కింద ప్రస్తుతం అమలవుతున్న రైతు పథకాలే గాక, ఉత్పత్తి పెంచే వ్యవసాయ యాంత్రికరణకు ఇది దోహద పడుతుంది.

ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రిం క్లర్లు, కోళ్ల పరికరాలు, బయో-పెస్టిసైడ్స్ 12 నుండి 5 శాతానికి తగ్గగా.. ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు 18 నుంచి 5 శాతం స్లాబులోకి మారాయి. వైద్య రంగం విషయాని కొస్తే డయాగ్నస్టిక్ కిట్లు, అత్యవసర మం దులపై ట్యాక్స్ ఎత్తేయడం శుభపరిణా మం. ఆయుర్వేద, యునానీ, హోమియోపతి మందులపై పన్ను 12 నుంచి 5 శాతం తగ్గడం, థర్మామీటర్లు, మెడికల్ ఆక్సిజన్, శస్త్ర చికిత్స పరికరాలు..12,18 నుంచి 5 శాతం స్లాబులోకి మారాయి. ఇవాళ ఆరోగ్య బీమా నిత్యావసరంగా మారిపోయింది. భారత్‌లో దాదాపు 100 కోట్ల జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీదారులు ఉన్నారు. దీనిపై సంవత్సరానికి 9 లక్షల కోట్ల టర్నోవర్ ఉంటుంది. తాజాగా సున్నా శాతం జీఎస్టీ వల్ల పాలసీ దారులకు దాదాపు 65 వేల నుంచి 75 వేల కోట్ల లబ్ధి దక్కుతుంది. వీటితో పాటు హౌసింగ్, సేవా, టెక్స్‌టైల్, రియల్ ఎస్టేట్ రంగాలకు భారీ లాభం చేకూరనుంది. 

సంస్కరణల రహస్యం

జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల  కేవలం పన్నులు తగ్గడమే కాదు కొగోనుగోలుదారులకు కూడా లబ్ధి చేకూర్చనుంది. ఉత్పత్తి రంగం, ఎగుమతులు, టాక్స్ నెట్ పెరగడంతో పాటు అంతిమంగా ‘అమృత్ కాల్’ ఆర్థిక లక్ష్యం చేరడానికి ఇది దోహద పడనుంది. జీఎస్టీ సంస్కరణ వల్ల లాభాలు చాలానే ఉన్నాయి. జీఎస్టీ సంస్కరణల వల్ల తక్కువ ధరలతో ఎక్కువ డిమాండ్, ఎంఎస్‌ఎంఈలకు మద్దతు పెరగడం, జీవ న సౌలభ్యం, విస్తృతమైన పన్ను వలయం, తయారీ రంగానికి మద్దతు, ఆదాయ వృ ద్ధి, ఆర్థిక వేగం, సామాజిక రక్షణ కలగనుం ది. అల్పలాభః బహువిక్రయః ! వ్యాపారస్య మహత్త్వ మేతత్ !!.. అంటే తక్కువ లాభం, ఎక్కువ విక్రయం ఇదే జీఎస్టీ సం స్కరణల రహస్యం. 140 కోట్ల జనాభా ఉ న్న భారత్, అనేక దేశాల అసూయ, అణిచివేత ధోరణుల మధ్య ‘ప్రతి పౌరుడు, ప్ర తి కొనుగోలుదారుడు’ ఒక ఆర్థిక సైనికుడే. 

 వ్యాసకర్త: బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు