calender_icon.png 7 October, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల తీర్పుపై ఏం జరగనుందో ?

07-10-2025 12:46:52 PM

గ్రామాల్లో ఎక్కడ చూసినా చర్చలే

వలిగొండ,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై( local body election verdict) బుధవారం హైకోర్టు తన తీర్పు తెలియజేయునది. దీంతో హైకోర్టు తీర్పుతో ఏం జరుగుతుందోనని సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. గ్రామాలలో ఏ నలుగురు ఒకచోట గుమ్మికూడిన కోర్టు తెలియజేసే తీర్పు కొత్త రిజర్వేషన్ కు అనుకూలంగా వస్తుందా లేదా పాత రిజర్వేషన్ కు అనుకూలంగా వస్తుందా లేదా పాత రిజర్వేషన్ మార్చి మరోసారి రిజర్వేషన్లను ప్రకటించే అవకాశం ఉందా అనే చర్చలు కొనసాగుతున్నాయి. అయితే కొత్త రిజర్వేషన్లు ఉండాలని కొంతమంది ఆశావాహులు, పాత రిజర్వేషన్లు ఉండాలని మరి కొంతమంది ఎన్నికలలో పోటీ చేసే ఆశావాహులు లోలోన భగవంతుని ప్రార్థిస్తూ హైకోర్టు తీర్పుపై ఆతృతగా ఎదురుచూస్తున్నారు.