30 June, 2026 | 1:44 AM

న్యూ గాయత్రీనగర్‌లో ప్రమాదకరమైన విద్యుత్ స్తంభం, చెట్టు కొమ్మల తొలగింపు

30-06-2026 12:00 AM

మీర్ పేట్, జూన్ 29 (విజయక్రాంతి ): మహేశ్వరం నియోజకవర్గం జిల్లేలగూడ (59వ డివిజన్) న్యూ గాయత్రి నగర్ రోడ్ నెంబర్-1 టర్నింగ్లో చాలా రోజుల నుండి పడిపోయే స్థితిలో ఉన్న 11 KV హై టెన్షన్ విద్యుత్ స్తంభం సమస్య పరిష్కారమైంది. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ’ఫెడరేషన్ ఆఫ్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్’ సెక్రటరీ, బీజేపీ నాయకులు వంటేరు నర్సింహ్మ రెడ్డి మరియు ప్రతినిధులు సమస్యను విద్యుత్ అధికారుల  దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై వెంటనే స్పందించిన ఏఈ బాల గౌడ్, సిబ్బందితో కలిసి క్రేన్ సహాయంతో స్తంభాన్ని సరిచేశారు. అలాగే, శ్రీ గాయత్రి నగర్లో విద్యుత్ వైర్లపైకి ప్రమాదకరంగా పెరిగిన చెట్టు కొమ్మలను ఫారెస్ట్ అధికారులు తొలగించారు. సమస్యను త్వరగా పరిష్కరించినందుకు వంటేరు నర్సింహ్మ రెడ్డి, జజాల మల్లారెడ్డి తదితరులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీల సమస్యల పరిష్కారానికి ఫెడరేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.