07-12-2025 02:13:51 PM
హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. లాలాపేట వద్ద ఆదివారం ఉదయం ఓ కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులు కీసర నుండి తార్నాకకు అల్పాహారం కోసం ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మృతులలో ఒకరిని మల్కాజ్‌గిరి నివాసి హర్షవర్ధన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.