14 July, 2026 | 3:35 AM

పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శుల తొలగింపు

14-07-2026 12:07 AM

పిడిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ కన్నా

ముషీరాబాద్, జూలై 13(విజయక్రాంతి): ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యు) చంద్రన్న వర్గం రాష్ట్ర అధ్యక్ష కా ర్యదర్శులుగా కొనసాగుతున్న ఎం. వెంకట్ రెడ్డి, ఎ. సాంబలను తొలగించినట్లు పిడిఎస్ యు జాతీయ ప్రధాన కార్యదర్శి ఇడంపాక విజయ్ కన్నా తెలిపారు. సోమవారం  హైదరాబాదులోని విద్యానగర్ లోని పిడిఎస్ యు రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. పవన్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం  జరిగింది.

ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యుల రాజీనామా లేఖలపై రాష్ట్ర కార్యవర్గం చర్చించి వారి రాజీనామాలను ఆమోదించింది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న ఎం. వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఏ. సాంబలను రాష్ట్ర బాధ్యతల నుండి తొలగిస్తూ తీర్మానించింది.  మొత్తం 8మంది సభ్యులు రాష్ట్ర కార్యవర్గం నుండి తొలగించబడినట్లు ఖన్నా తెలిపారు.

రాష్ట్ర అధ్యక్షుడితో పాటు రాజీనామాలు సమర్పించిన వారితో కలిసి వరంగల్లో రాష్ట్ర కార్యవర్గ  సమావేశం నిర్వహించడం నిర్మాణ వ్యతిరేకమైనదని పిడిఎస్ యు రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. అలాగే పిడిఎస్ యూ తెలంగాణ రాష్ట్ర మహాసభలో ఏర్పాటు చేసుకున్న 6 గురు కో- ఆప్షన్ సభ్యులను రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా కె. పవన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కే.గణేష్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు. దీంతో మొత్తం15 మందితో నూతన రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు జరిగిందని అన్నారు.