calender_icon.png 10 July, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

345 రాజకీయ పార్టీలపై ఈసీ కొరడా

27-06-2025 12:35:03 AM

న్యూఢిల్లీ, జూన్ 26: రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝుళిపించింది. 2019 నుంచి ఇప్పటివరకు గడిచిన ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనే పోటీ చేయని 345 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను గుర్తించి వాటిని డీలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఆయా పార్టీల కార్యాలయాలు కూడా ఎక్కడా లేవని ఈసీ గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ జాబితాలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పార్టీలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. ఎన్నికల సంఘం వద్ద సుమారు 2800కి పైగా గుర్తింపులుని నమోదిత రాజకీయ పార్టీలు ఉన్నాయి. సాధారణంగా ఒక పార్టీ గుర్తింపు పొందాలంటూ సాధారణ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లను లేదా నిర్దిష్ట సంఖ్యలో సీట్లను గెలుచుకోవాలి. మిగిలిన పార్టీలను నమోదిత గుర్తింపు లేని పార్టీలుగానే పరిగ ణిస్తారు.