15 May, 2026 | 2:53 AM

పగిలిన డ్రైనేజీ పైప్ లైన్‌కు మరమ్మతులు చేపట్టాలి

15-05-2026 12:27 AM

ఘట్‌కేసర్, మే 14 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి చౌదరిగూడ విజయపురి కాలనీలో పగిలిన డ్రైనేజీ పైప్ లైన్ కు మరమ్మత్తులు చేపట్టాలని ఆ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. విజయపురి కాలనీ రోడ్ నెంబర్-2 లో సంవత్సరం క్రితం శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణం వేయడం కోసం అప్పటి మున్సిపల్ అధికారులు జెసిబి తో వర్క్ చేయించడంతో డ్రైనేజీ పైప్ లైన్ పగిలింది.

దీంతో పగిలిన పైప్ లైన్ నుండి మురుగునీరు కాలనీలోని రోడ్లమీద కి ప్రవహిస్తు దుర్వాసన  రావడంతో కాలనీ వాసులు నడవలేని పరిస్థితి నెలకొందని కావున సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ ఘట్ కేసర్ సర్కిల్ అధికారులు స్పందించి వెంటనే పగిలిన డ్రైనేజీ పైప్ లైన్ కు మరమ్మత్తు పనులు చేపట్టాలని కాలనీ వాసులు కోరుచున్నాను.