తాండూరులో ఈదురు గాలులతో మోస్తరు వర్షం
15-05-2026 12:27 AM
తాండూరు, మే 14, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరులో గురువారం ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం 10 గంటలనుండి ఎండలు తీవ్రమై ఉష్ణోగ్రతలు అధికం కావడంతో ప్రజలు హైరానా పడుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈదురు గాలులు వీచి వర్షం వర్షం కురిసింది. డీసీఎంఎస్ కార్యాలయానికి పెద్దెముల్ మండలం తట్టేపల్లి, తదితర ప్రాంతాల నుండి విక్రయించేందుకు తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసిపోయింది. వర్షం నుండి వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతన్నలు తీవ్ర అవస్థలు పడ్డారు.






