2 April, 2026 | 2:28 AM

పగిలిన నీటిపైప్‌నకు మరమ్మతులు చేపట్టాలి

02-04-2026 12:42 AM

ఘట్‌కేసర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : నీటి సరఫరా పైప్ పగిలి వృధాగా పోతున్న నీటి పైపుకు ఘట్ కేసర్ సర్కిల్ అధికారులు వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిప్పల నర్సింగరావు డిమాండ్ చేశారు. ఘట్ కేసర్ సర్కిల్ పోచారం  డివిజన్ పరిధిలోని కొర్రెముల అంబేద్కర్ నగర్‌లో ప్రధాన రహదారి పక్కన ఉన్న త్రాగునీటి సరఫరా మ్యానువల్ వద్ద పైప్ లైన్ పగిలి 10 రోజులుగా నీరు వృధాగా పోతున్నదని తెలిపారు.

ఈ విషయాన్ని స్థానిక సర్కిల్ కార్యాలయంలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. అసలే వేసవికాలం నీళ్లకి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు. అధికారుల నిర్లక్ష్యం వల్ల త్రాగునీరు వృధాగా పోతున్న పరిస్థితి వెంటనే పగిలిన నీటి పైపులకు మరమ్మత్తులు చేయగలరని ఆయన డిమాండ్ చేశారు.