14 July, 2026 | 4:50 AM

ఎన్.హెచ్.565 నష్టపరిహారం పెంచాలని కలెక్టర్‌కు వినతి

14-07-2026 12:00 AM

నల్లగొండ టౌన్, జులై 13 : ఎన్.హెచ్.565 రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న 211 మంది రైతులు నష్టపరిహారం పెంచాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కు బాధిత రైతులు వినతిపత్రం అందజేశారు. జాతీయ రహదారి కోసం తమ వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాలు కోల్పోయామని, ప్రస్తుతం ఎకరానికి రూ.18, లక్షలు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తున్నారని,81 లక్షలు ఇవ్వాలని కోరారు.

ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం తమ భూముల విలువ ఒక్క ఎకరానికి 2 కోట్ల వరకు ఉందని రైతులు పేర్కొన్నారు. అప్పటి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన ,.2025 ఏప్రిల్ 2న జరిగిన సమావేశంలో, జాతీయ రహదారికి భూములు ఇచ్చిన రైతులకు ఒక ఎకరానికి రూ.81, లక్షలు, ఇండ్ల స్థలాలకు చదరపు గజానికి రూ.10,500 చెల్లించాలని నిర్ణయించడం తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హామీ మేరకు వెంటనే నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని రైతులు కోరారు.

తగిన నష్టపరిహారం అందకపోతే జీవనోపాధి కల్పించే భూములు కోల్పోయి రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు.వినతిపత్రం అండీజే సిన వారిలో కమిటీ అధ్యక్షులు కున్రెడ్డి శేఖర్రెడ్డి, బొజ్జ మహేష్కుమార్, నిదానంపల్లి కృష్ణయ్య, మండడి వెంకట్రెడ్డి, దొండ నాగేష్, దుబ్బాక నాగేష్, వంగూరి నర్సింహ, కున్రెడ్డి నర్సిరెడ్డి, మండడి శశిధర్ రెడ్డి, వేణు, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.