calender_icon.png 26 January, 2026 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత రాజ్యాంగ రథయాత్ర

26-01-2026 09:26:25 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ధర్మ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ ఎస్డిఎల్సి అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ లోని భారత రాజ్యాంగ స్థూపం వరకు భారత రాజ్యాంగ రథయాత్ర నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ సమానంగా లబ్ధిచెందేవిధంగా భారత రాజ్యాంగం అమలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీ ఎస్ యు జిల్లా కన్వీనర్ ఠాగూర్ నాథ్, హూ కన్వీనర్ దిలీప్, జిల్లా నాయకులు కేశపాక తరుణ్, కేయు కన్వీనర్ ధర్మ,కో కన్వీనర్ రక్షిత, నందిని, సీతారాజు, రణధీర్, అభిరామ్, రాజు, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.