15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

గోదావరిఖనిలో సమ్మక్క సారలమ్మ జాతరకు భారీ బందోబస్తు

26-01-2026 09:42 PM

భక్తులకు ఇబ్బందులు లేకుండా జాతర నిర్వహిస్తాం ఏసిపి మడత రమేష్

గోదావరిఖని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గోదావరి ఒడ్డున నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరను భారీ బందోబస్తు మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను 1-టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, 2-టౌన్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు లతో కలిసి జాతర ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఏసీబీ మాట్లాడుతూ ఎమ్మెల్యే మక్కన్ సింగ్, సిపి సూచనల మేరకు, సింగరేణి జిఎం లలిత్ కుమార్ సహకారంతో జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నామని, పార్కింగ్ స్థలంలోనే వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు చేశామని, భక్తులకు తాగునీటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని,  అమ్మవార్ల దర్శనానికి వెళ్లేందుకు క్యూలైన్లను ఏర్పాటు చేశామని ఏసిపి తెలిపారు.