calender_icon.png 26 January, 2026 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జై భీమ్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 09:37:30 PM

జై భీమ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ తాళ్లపల్లి విజయ్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి చర్చి సర్కిల్లోని జై భీమ్ జిల్లా కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జై భీమ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ తాళ్ల పెళ్లి విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ... డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అహర్నిశలు కష్టపడి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ సభ్యులు దేవరాజ్, ఇల్లందుల భాస్కర్, రాజ్ కుమార్, ప్రసన్న, రవీందర్, పీటర్, సుదర్శన్, ప్రభాకర్, జయపాల్, ధనుష్, సోను, రత్నం, పవన్, చింటూ తదితరులు పాల్గొన్నారు.