26-01-2026 09:34:51 PM
మిడ్జిల్: మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో స్వప్న జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ ఎడ్ల శంకర్ జాతీయ జెండాను ఎగరవేశారు. పోలీస్ స్టేషన్లో ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు జాతీయ జెండాను ఎగరవేశారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గీతాంజలి జాతీయ జెండాను ఎగరవేశారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచులు అధికారులు జాతీయ జెండాలను ఎగురవేసి గ్రామ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు