26-01-2026 09:31:08 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పోలీసు శాఖ సహకారంతో కొనసాగుతోన్న నిత్య జనగణమన జాతీయ గీతాళాపనకు నేటితో రెండు సంవత్సరాలు కావస్తుంది. ఈ సందర్భంగా గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా 100 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ చేశారు.
బెల్లంపల్లి బ్రాంచి పాఠశాల నుంచి విద్యార్థులు కాంట అంబేద్కర్ చౌరస్తా వరకు భగత్ సింగ్ విగ్రహం చౌరస్తా వరకు ఈ ర్యాలీ సాగింది. తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా వద్ద జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజల్లో దేశ భక్తిని సమైక్యత భావాన్ని పెంపొందించడం, దేశం కోసం స్వాతంత్య్ర సమరయోధుల ప్రాణ త్యాగాలను సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి మనకు భద్రత కల్పిస్తున్నారు.
సైనికులని గుర్తు చేసుకొని జాతీయ గీతాన్ని గౌరవించాలనే సద్దుదేశంతో ద్వితీయ వార్షికోత్సవం చేపట్టామన్నారు. గత రెండు సంవత్సరాలుగా ప్రతి రోజు ఉదయం 8 గంటలకి నిత్య జనగణమన జాతీయ గీతాళపన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జనహిత సేవాసమితి సభ్యులు, చిప్ప అజయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.