26-01-2026 11:35:15 AM
కామారెడ్డి, జనవరి 26(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిబిపెట్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంపీడీఓ పూర్ణ చంద్రోదయ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం ఎంపీడీఓ పూర్ణ చంద్రోదయ రావు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛలను ప్రతి పౌరుడు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు