26-01-2026 11:34:09 AM
కామారెడ్డి, జనవరి 26(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో దేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా అవతరించిందని గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛలను ప్రతి పౌరుడు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయడంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా ముగిసింది.