12 May, 2026 | 11:51 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

పెట్రోల్ డీజిల్ కోసం లొల్లి..

28-04-2026 01:10 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో సోమవారం పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. జిల్లావ్యాప్తంగా అనేక మండలాలు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పెట్రోల్, డీజిల్ పంపుల్లో డీజిల్ పెట్రోల్ కొరత తలెత్తింది. జిల్లాలోని నర్సింహులపేట, కేసముద్రం, ఇనుగుర్తి తదితర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి పడిగాపులు పడ్డారు.

డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా లేదని పెట్రోల్, డీజిల్  కోరినంతగా పోయడం లేదని వినియోగదారులు పలు చోట్ల ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వాహనదారులను క్రమ పద్ధతిలో నియంత్రించి పెట్రోల్ డీజిల్ పంపిణీ చేయించారు. వచ్చింది వచ్చినట్టే కొద్ది క్షణాల్లో పెట్రోల్, డీజిల్ అయిపోతుండడంతో మళ్లీ మరుసటి రోజు స్టాక్ వచ్చేంత వరకు పెట్రోల్, డీజిల్ పంపులు మూతపడుతున్నాయి.  అధికారులు స్పందించి పెట్రోల్, డీజిల్ కొరత తీర్చాలని వాహనదారులు కోరుతున్నారు.