calender_icon.png 1 January, 2026 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డుల ఓటర్లను సవరించాలని వినతి

01-01-2026 12:00:00 AM

ఆమనగల్లు, డిసెంబర్ 31( విజయక్రాంతి): ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని  ఉన్న ఓటర్ల ను వార్డుల వారిగా విభజించాలని కోరుతూ బుధవారం మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్ కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ లో ని 1 వ వార్డు చంద్రాయన్ పల్లి తండా పరిధిలోని కాటన్ మిల్లు ఓట్లను తొలగించి.. తండా వరకే కొనసాగించాలని, 2 వ వార్డు  ముర్తోజుపల్లి  లోని  సాకిబండ తండా ఓట్ల ను తొలగించాలని 4 వ వార్డు పరిధిలోని జంగారెడ్డి పల్లి ఓట్లు నుచ్చుకుంట తండాలో ఉన్నాయని వాటిని తొలగించి జంగారెడ్డిపల్లి లో కలపాలని  9వ వార్డు లో  ఉన్న విఠాయిపల్లి లో ఉన్న ఓట్లు తొలగించి విఠాయిపల్లి లోనే కొనసాగించాలని చెప్పారు.

ఒకే కాలనీ లో వివిధ వార్డుల్లో ఉన్న ఓటర్లను కూడా వార్డుల వారీగా విభజించాలని కమిషనర్ ను కోరారు.దీనికి  సానుకూలుంగా స్పందించిన కమిషనర్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుర్రం కేశవులు, తోట శ్రీను, మాజీ కోఆప్షన్ మెంబర్ ఖాదర్ ఖాద్రి, కృష్ణ నాయక్, పూసల సత్యం, మల్లేష్ నాయక్, చెన్నారెడ్డి, మైసయ్య, కుమార్ గౌడ్, శ్రీను నాయక్, ఖాదర్, హలీం, నాజర్, రఫీ, వాటర్ బాబా, మహేష్, పాతకోట రాజు, గౌస్, ప్రసాద్, జైపాల్ పాల్గొన్నారు.