2 July, 2026 | 4:10 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

కాలనీలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డికి వినతి

16-06-2025 01:25 AM

మేడ్చల్, జూన్ 15(విజయ క్రాంతి): తమ కాల నీలలో నెలకొన్న సమస్య లు పరిష్కరించాలని వివిధ కాలనీల ప్రజలు ఆదివారం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మ చ్చ బొల్లారం డివిజన్లో ఎస్ వి ఎస్ పవన్ రెసిడెన్సి, జనహితం ఆర్ యు బి సమీపంలో నాలాలో పూడిక చేరిందని దీంతో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తోందని తెలిపారు.

పూడిక తొలగించాలని, నాలా వెంబడి ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న భవనాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. వెస్ట్ వెంకటాపురం డివిజన్ దినకర్ కాలనీలో రాయుని చెరువు నుంచి వచ్చే మురుగునీటిని మళ్లించాలని కాలనీవాసులు కోరారు. అలాగే ఆషాడం బోనాలు నిర్వహణకు నిధులు మంజూరు చేయించాలని వివిధ కాలనీల ప్రజలు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కోరారు.