calender_icon.png 3 December, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ మేడం కనిపించలేదా అక్రమ దుకాణాలు

03-12-2025 05:12:24 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారితో పాటు ఆసుపత్రికి వెళ్లే ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ రోడ్డును పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు అక్రమ వ్యాపార దుకాణాలు కల్ల సాక్షిగా కనిపించాయి. ఆర్డీవో కార్యాలయం నుంచి ఎన్టీఆర్ ట్యాంక్బండ్ వరకు ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన ఫుట్ పాత్ లపై అక్రమ వ్యాపార దుకాణాలు రేకుల షెడ్లు తోపుడు దుకాణాలు దర్శనమిచ్చిన ఆమె వాటిని తొలగించేందుకు కనీస ఆదేశాలు ఇవ్వలేదు.

ప్రజల సౌకర్యం కోసం రోడ్డు అభివృద్ధి పనులను చేపట్టాలని మున్సిపల్ అధికారులు ఆదేశించినప్పటికీ ఫుట్ పాత్ అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసు మున్సిపల్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అధికారులు ఉన్నారు.