రోడ్డుకు మరమ్మత్తు చేయాలని కలెక్టర్‌కు వినతి
24-03-2026 12:40 AM
నల్లగొండ టౌన్, మార్చి 23 : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాతపల్లెలో గుంతల మయంగా ఉన్న రోడ్డుకు మరమత్తులు చేయాలని 3వ డివిజన్ కార్పొరేటర్ మల్లేశ్వరి అశోక్ సోమవారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. రోడ్డు పూర్తిగా గుంతల మయం కావడంతో నడిచేందుకు ఇబ్బందిగా ఉందని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పాతపల్లి- శేషమ్మగూడెం మధ్యన బ్రి డ్జి నిర్మాణం చేపట్టాలన్నారు.




