calender_icon.png 5 July, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగాచిలో కొనసాగుతున్న రెస్క్యూ

05-07-2025 01:52:08 AM

  1. చికిత్స పొందుతూ మరో కార్మికుడి మృతి

  2. 39కి చేరిన మృతుల సంఖ్య 

ఇంకా లభించని 9 మంది జాడ 

ఆందోళనలో కుటుంబ సభ్యులు

సంగారెడ్డి, జూలై 4 (విజయక్రాంతి/పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు ఇంకా కొనసాతున్నాయి. ఇప్పటికే 38 మంది మృతి చెందగా.. పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొం దుతూ మహారాష్ట్రకు భీంరా వు అనే కార్మికుడు శుక్రవా రం మృతి చెందాడు. దీం తో మృతుల సంఖ్య అధికారికంగా 39కి చేరింది.

కాగా మొత్తం 143 మంది కార్మికులకు గాను 61 మంది కార్మికులు సురక్షితంగా ఉండగా ఆసుపత్రి లో 22 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో మరి కొంత మంది ప్రా ణాలతో కొట్టుమిట్టాడు తుండగా కోలుకున్న 12 మంది కార్మికులను డిశ్చార్జి చేశారు. చికిత్స పొందుతున్న ఐదుగురి కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటివరకు 31 మంది కార్మికుల మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగిం చారు.

ఇంకా ఏడుగురు కార్మికుల మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. మృతి చెందిన 22 మంది కార్మికుల కుటుంబాలకు రూ.లక్ష తక్షణ ఆర్థిక సాయం, 34 మంది క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున చెల్లించినట్టు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.

ఇంకా ఈ ఘటనలో తొమ్మిది మంది ఆచూకీ లభించలేదు. కాగా ఆచూకీ తెలియని కార్మికుల కుటుంబాలకు రూ.10 వేల తాత్కాలిక సహాయం అం దించారు. ఆచూకీ తెలియని కార్మికుల కు టుంబ సభ్యులు పరిశ్రమ వద్దే ఉంటూ పడిగాపులు కాస్తున్నారు. తమవారు ఏమయ్యా రోనని రోధిస్తూ ఆందోళన చెందుతున్నారు. 

కనిపించని వారి మాటేమిటి?

సిగాచి పేలుడు ఘటనలో అధికారికంగా 39 మంది మృతి చెందగా మరో 9 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పేలుడు జరిగి ఐదు రోజులవుతున్నా వారి ఆచూకీ దొరకడం లేదు. ఐదు రోజుల నుంచి శిథిలాల తొలగింపు చర్యలు చేపడుతున్నా కనిపించకుండా పోయిన 9 మంది జాడ మాత్రం కనిపెట్టలేక పోతున్నారు. దీంతో ఆ కుటుంబాల బాధితులతో పాటు ఇంకా శవాలను గుర్తించాల్సిన ఏడుగురి కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు.

దొరికిన ఏడు మాంసం ముద్దలు ఎవరివో, అందులో తమవారు ఉన్నారో లేదోనన్న ఆందోళనతో బాధితులు రోధిస్తున్నారు. అయితే శిథిలాల తొలగింపు ఇంకా ఎన్నిరోజులు చేపడుతారో, మృతదేహాలను అసలు గుర్తిస్తారో లేదోనన్న భయాం దోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మిస్సయినవారి ఆచూకీ లభించే వరకు రెస్క్యూ టీంల శోధన కొనసాగిస్తామని కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు.

సహాయక కేంద్రం ఏర్పాటు

పాశమైలారం వద్ద ప్రత్యేకంగా ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మిస్సయిన 11 మంది కార్మికుల కుటుంబీకులకు తాత్కాలికంగా వసతిని ఏర్పాటు చేశా రు. వారికి అవసరమైన భద్రత, ఆహారం, ఆరోగ్య సదుపాయాలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

నాకు ఎవరూ లేరు.. నేనెట్లా బతకాలె

“కంపెనీలో పనికి చేరిన రెండు రోజులకే  నా భర్త చని పోయిండు. అత్తింటి వారు, తల్లివైపు నాకు ఎవరూ లేరు. నాకు ఐదు నెలల పాప. నా పరిస్థితి ఏంది సారూ... నేనెట్ల బతకాలే” అంటూ సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన భీంరావు భార్య సోని రోధిస్తూ మీడియా ముందు తన బాధను చెప్పుకుంది.

- మృతుడు భీంరావు భార్య సోని